ప్రజా పోరాటయోధుడు బాలకృష్ణన్.
సిపిఎం జిల్లా స్కార్యదర్శి అన్నవరపు కనకయ్య.
బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ప్రజల కోసం శ్రమించే దీటైన పోరాట యోధుడు కొడియేరి బాలకృష్ణన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం సారపాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దోపిడీ లేని భారత సమాజం కోసం, సామాజిక పరివర్తన కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని అంచలంచెలుగా మూడుసార్లు కేరళ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అచ్చున్నత నిర్ణయాక మండలి సభ్యులుగా, ఐదుసార్లు శాసన సభ్యులుగా, కేరళ హోమ్ మినిస్టర్ గా ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం నిర్వహించడమే ఆయనకు ఘనమైన నివాళి అని, మతతత్వ బిజెపి విధానాలను ఎండగట్టాలన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. బూర్గంపహాడ్ మండలం లో గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా సుమారు10 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కొడిశాల రాములు, కొమరం కాంతారావు, మడి రమేష్ లెనిన్ బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.