ప్రజా ప్రతినిధులు అలసత్వం వీడాలి

నూతనంగా ప్రకటించిన అగ్ని మాపక కేంద్రాల జాబితాలో బోథ్ ప్రాంతానికి కేటాయించలేక పోవాడానికి నిరసనగా స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బోథ్ బచావో కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసనతేలిపారు. మండల పరిధిలో తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న, దాని ద్వారా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్న అటవీ ప్రాంతంలో అనేక మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్న బోథ్ మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయక లేకపోవడం, దాని కొరకు కృషి చేయలేకపోవడం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల అలసత్వమే అని బోథ్ బచావో కన్వీనర్ చంటి పసుల అన్నారు.మండలానికి ఈ జాబితాలో అగ్ని మాపక కేంద్రం కేటాయించకపోవడం స్థానిక ప్రజా ప్రతినిధుల చేతగానితనానికి నిదర్శనమని, స్వార్ద రాజకీయాలు మాని నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు
 చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల వెంకటేష్, సల్ల రవి, సుమేర్ పాష, కురుమే ప్రభాకర్, బోథ్ బచావో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.