ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

.

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళల భాగస్వామ్యంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ఆదివారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్ర సమరయోధులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వివిధ పాఠశాలల విద్యార్థినులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ అలరించాయి.
అనంతరం స్వాతంత్ర సమరయోధులు బత్తిని యాదగిరి గౌడ్, మన్నె గోపాల్ రెడ్డి, ఎడ్ల నారాయణ రెడ్డి, బండ్రు నరసింహ కుమారుడు ప్రభాకర్, రావుల సత్తయ్య కుమారుడు హరిబాబు లను జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణరెడ్డి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రజలు, మహిళలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈనెల 16, 17, 18 తేదీలలో ఘనంగా జరిగాయని తెలిపారు. 16వ తేదీన భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలలో నిర్వహించిన ర్యాలీలలో ప్రజలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. 17వ తేదీన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో, డివిజన్, మండలాలు, గ్రామాలలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయని తెలిపారు. ఈరోజు 18వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు, అదే విధంగా స్వాతంత్ర సమరయోధుల సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరా చారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి. వెంకటేశ్వరరావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనంజయ్, అధికారులు పాల్గొన్నారు.