ప్రజా ప్రయోజనాలే కమ్యునిష్టులు లక్ష్యం
– గిరిజన,దళితులు మేలు కోరే తెరాసకు ఓటింగ్ మద్దతు
సిపిఐ(ఎం) మండల కమిటీ – అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి )
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కమ్యునిస్టు లు రాజకీయ ఎత్తుగడలు వేస్తారని,ముఖ్యంగా దళిత – గిరిజనులు మేలు కోరే మునుగోడు లో తెరాస కు సిపిఐ(ఎం) తాత్కాలిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఉద్ఘాటించారు.
గురువారం అశ్వారావుపేట లో సిపిఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో,మండల కమిటీ సభ్యుడు ముల్లగిరి గంగరాజు అద్యక్షతన జరిగిన మండల స్థాయి విస్త్రుత సమావేశానికి పుల్లయ్య ముఖ్య అతిథిగా హాజరు అయి సభ్యులను,మండల కమిటీ బాధ్యులను ఉద్దేశించి మాట్లాడారు.
మతతత్వాన్ని ఉసి గొలిపే రాజకీయ పార్టీ ఏదైనా సమాజాన్ని విచ్చిన్నం చేస్తుందని,ప్రస్తుతం భాజపా ఆ కుయుక్తులు తోనే దేశంలో విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతుందని,ఈ కారణంగానే భాజపా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసే తెరాసకు సిపిఐ(ఎం) మద్దతు ఇస్తుందని తెలిపారు.
పార్టీ రాష్ట్ర నాయకులు సి.ఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే డిమాండ్ లు ఆయన ముందు ఉంచారని,వాటి పై సి.ఎం సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ చిరంజీవి,మండల కమిటీ సభ్యులు ,గడ్డం సత్యనారాయణ,మడిపల్లి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.