ప్రజా ప్రస్థానం పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల

– వైఎస్సార్ 5 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండి అద్భుతమైన పథకాలను అమలు చేశారు..

 

– వైఎస్సార్ హయాంలో ప్రతి పథకం అద్భుతమే :-వైఎస్ షర్మిల

 

 

గద్వాల రూరల్ ఆగష్టు 23 (జనంసాక్షి):- మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వైఎస్సార్ కల్పించారని, ఇప్పుడు కేసీఅర్ 8 ఏళ్ల పరిపాలన అంతా మోసం,ముఖ్యమంత్రి కేసీఅర్ ను మోసగాడు అనాలని,ఉమ్మడి పాలమూరు జిల్లా ను కేసీఅర్ ఏనాడు పట్టించుకోలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు..ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు రోజుల నుంచి పాదయాత్ర చేశారు‌‌..అనంతరం గద్వాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ‌వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు వలసల జిల్లా..ఏనాడు కేసీఅర్ పట్టించుకున్నది లేదని,కేసీఅర్ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు..వైఎస్సార్ మాత్రం పాలమూరు జిల్లాను పచ్చగా ఉండాలి అనుకున్నారు..పచ్చగా ఉండాలని అనుకున్నారు..వైఎస్సార్ పాలమూరు యూనివర్సిటీ నిర్మించాడు..కల్వకుర్తి,భీమా,నెట్టెంపాడు ప్రాజెక్ట్ ల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన ఘనత వైఎస్సార్ ది..వైఎస్సార్ నీళ్ళు ఇవ్వబట్టే ఈ భూములకు ధరలు పెరిగాయి..పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ వైఎస్సార్ కళల ప్రాజెక్ట్..35 వేల కోట్ల ప్రాజెక్ట్ ను ఇప్పుడు కేసీఅర్ 50 వేల కోట్లకు పెంచారు..రీ డిజైన్ ల పేరుతో పాలమూరు పేరుతో కమీషన్ల తింటున్నాడు..8 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అంటే ఇప్పుడు కథలు చెప్తున్నారు..కేంద్రం సహకరించలేదు ..కృష్ణా నీళ్ళ వాట తేల్చలేదు అని కబుర్లు చెప్తున్నారని,కాళేశ్వరం ప్రాజెక్ట్ తో భారీగా కమీషన్ లు తింటున్నారు..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అటక ఎక్కించారని,పాలమూరు మీద ప్రేమ ఉంటే ఎప్పుడో ప్రాజెక్ట్ పూర్తి చేసే వారని,ఇదే గద్వాల్ నియోజక వర్గం కోసం నేట్టెం పాడు కట్టారు..రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు..7 రిజర్వాయర్లు కట్టించారు..గద్వాల్ నియోజక వర్గం లో చేనేతలు ఎక్కువ..చేనేతలకు సహాయం చేసింది లేదు..గద్వాల్ చేనేత కు బరోసా లేదు..మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో ఇదే టౌన్ లో 4 గురు చనిపోయారు..వాళ్ళ ప్రాణాలకు విలువ లేదని,చనిపోయిన వాళ్ళ కుటుంబాలను అడుకొలేదు..మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కమీషన్ల ప్రాజెక్ట్..వైఎస్సార్ మైనార్టీ లకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే కేసీఅర్ 5 శాతానికి పెంచలేక పోయారు..12 శాతం ఇస్తామని మోసం చేశారు..
ఈ గద్వాల్ పట్టణానికి కేసీఅర్ చేసింది ఏమీ లేదు..టిఆర్ఎస్ ఎమ్మెల్యే కి అక్రమాల మీద…ఇసుక మాఫియా మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదన్నారు..ఎమ్మెల్యే భూ కబ్జాల మీద బిజీ గా ఉన్నారని,గట్టు ప్రాజెక్ట్ 8 ఏళ్లు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు..డికె. అరుణమ్మ ను రాజకీయంగా వైఎస్సార్ పైకి తెచ్చారు,ఒక వెలుగు వెలిగింది అంటే వైఎస్ఆర్ క్యాబినెట్ లో తీసుకోబట్టే కదా…వైఎస్సార్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు వచ్చింది అంటే అరుణ కి నచ్చలేదు..వైఎస్సార్ బిడ్డ కు ఇక్కడేం పని అరుణ అంటుంది..వైఎస్సార్ బిడ్డ ను నేను..ఇదే గడ్డ మీద పెరిగిన ..ఇక్కడే చదువుకున్న ఇక్కడే చదువుకున్న…ఇక్కడే బిడ్డను కన్నా..నా బ్రతుకు ఇక్కడే..నా గతం ఇక్కడే…ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు ఉంది..తెలంగాణ లో వైఎస్సార్ పాలన లేదు కాబట్టే…పార్టీ పెట్టా అని అరుణ తెలుసు కోవాలని తెలంగాణ కోసం వైఎస్సార్ కుటుంబం ఏం చేసింది అని అరుణ అడుగుతుంది..నేను అడుగుతున్న… గద్వాల ప్రజల కోసం మీరు చేశారో చెప్పాలి..ఇన్ని ఏళ్లుగా మీ కుటుంబం రాజకీయాల్లో ఉందని,వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే గద్వాల్ భాగుపడింది..2018 లో బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు..ఇక్కడ అన్ని పనులు వాళ్ళవే..పెట్రోల్ బంకు కు..గ్యాస్ గోడౌన్ లు వాళ్ళవే.. ప్రాజెక్ట్ ల్లో కమీషన్లు వాళ్లవే..డి కె అరుణ కాదు..కే డి అరుణ..ఇది మీ బీజీపీ నాయకులు అంటున్నదే..మీరు ఒక మహిళ…ఇక్కడ ఆసుపత్రి లో కాన్పు కోసం వెళ్తే సౌకర్యాలు లేవు..నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు కదా ..ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్న బీజేపీ లో ఉన్నారు కదా… మీ గద్వాల్ లో కనీసం ఆసుపత్రి కూడా లేదు..
డి కె అరుణ ఎప్పుడు ఈ నియోజక వర్గ ప్రజల పక్షాన నిలబడింది లేదని,మీరు ఒక తల్లి..కనీసం స్కూళ్ళలో బిడ్డలు ఎలా చదువుకుంటున్నారు అని ఏనాడైనా చూశారా..ఆ పిల్లల జీవితాలు పట్టించుకున్నారా..డి కె అరుణ కుటుంభానికి ఎస్సీ ,ఎస్టీ లు అంటే లెక్క లేదని,అందుకే ఈ మధ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యిందని,తెలంగాణ లో 80 శాతం లిటరసీ ఉంటే ..ఈ గద్వాల్ లో మాత్రం 40 శాతం మాత్రమే అక్షరాస్యత ముందు వీటిని పట్టించుకో అరుణ గారు.. మమ్మల్ని విమర్శించడం కాదు
ఇక కేసీఅర్ ది ఒక దిక్కుమాలిన పాలన రైతుకు పంట నష్టం జరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు..రైతు జీవితాన 59 ఏళ్లకే చనిపోవాలని మరణ శాసనం రాస్తున్నారు..వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్తెలంగాణ లో ప్రతి రోజూ రైతు ఆత్మహత్యలే
రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నా భర్తీ చేయక పోవడం తో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..డిగ్రీలు, పిజిలు చదువుకుంటున్న వారు పత్తి వెర బోతున్నారు.. పైసా పైసా కూడబెట్టి చదివిస్తే చివరికి పత్తి వేరబోవలా..? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు… కేసీఅర్ కు రాష్ట్రం అప్పజెప్పినం..16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టాడు.. కేసీఅర్ కు ఉన్న ధ్యాసంతా డబ్బులు సంపాదించుకోవాలని,తెరాస పార్టీ బ్యాంక్ అకౌంట్ లో 860 కోట్లు ఉందట…నెల నెలా 3 కోట్ల వడ్డీలు వస్తాయి అంట..ఇది చాలదా…కేసీఅర్ కుటుంభానికి బంగారం అయింది అని చెప్పడానికి తెలంగాణ లో కనీసం మహిళల,మైనర్ బాలిక ల మాన – ప్రాణాలకు రక్షణ లేదు.. హైదరాబాద్ నడి గడ్డ మీద మైనర్ బాలిక మీద రేప్ జరిగితే అధికార పార్టీ పిల్లలు దర్జాగా తిరుగుతున్నారు..కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక అద్బుతం అన్నారు .బాహుబలి మోటర్లు అన్నారు.. మూడేళ్లకు మునిగిపోయింది..నా రక్తం అని చెప్పిన కేసీఅర్ కళల ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలిపోయింది.. కాంగ్రెస్ ,బీజేపీ కాళేశ్వరం మీద ప్రశ్నించడం లేదు..రాష్ట్రం లో మెగా మోసం ప్రాజెక్ట్ లు అన్ని ఒక వ్యక్తి కే ఇవ్వడం మెగా కృష్ణా రెడ్డి కే అన్ని ప్రాజెక్ట్ లు.. చివరికి స్కూల్ బెంచ్ లు వేయలన్నా మెగా కే ప్రాజెక్ట్.. కేసీఅర్ కుటుంభానికి వాట ఉంటుంది కాబట్టే మెగా కి అన్ని ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు..ఇద్దరు కలిసి దోచుకు తింటున్నారు.. రేవంత్ రెడ్డి అడగడు… బండి సంజయ్ అడగడు… అందరూ దొంగలే..అమ్ముడు పోయారు..అమిత్ షా…