ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల ప్రతినిధి నవంబర్ 07 (జనంసాక్షి):- ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా లో  వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 5 ఫిర్యాదులు రావడం జరిగింది.  పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను స్వయంగా  విన్న  జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్   గారు  వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా ఆయా   సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్సై లకు ఆదేశించడం అయినది. అలాగే సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలసిందిగా వారికి సూచించడమైనది. మరియు ప్రజలు తీసుకు వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చే ఏ ఫిర్యాదులు పెండింగ్ లేకుండా చూడాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.   ప్రజలు అత్యవసర సమయంలో డయల్- 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వచ్చిన పిర్యాదులు
భూ వివాదాలకు సంబందించి -02 పిర్యాదులు.
గొడవలకు సంబందించి -02 పిర్యాదులు.
ఇతర అంశాలకు సంబంధించి 01 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు..