ప్రజా సంక్షేమాన్ని విస్మరించే ప్రభుత్వాన్ని గద్దె దించాలి
కకారపల్లిథర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ పునరంకిత సభసంతబోమ్మాళి : మండలం దండిగోపాలపురం పంట మైదానంలో కాకరాపల్లి థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ పునరంకిత సభ జరిగింది. ఈ సభలో రాష్ట్ర మాజీ మంత్రితమ్మినేని సీతారం, సినీసటులు అర్ నారాయణ మూర్తి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జేవీ చలపతిరావు, ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకులు డా. కె. బాబూరావు, పీఓడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు వక్తలుగా పాల్గోన్నారు.