ప్రజా సమస్యలపై పోరాటంలో టీడీపీ విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వినిపించలేకపోతున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు దర్జాగా తప్పించుకు తిరుగుతున్పారని ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలకు చురుకులు అంటించారు. ఇందంతా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కారణంగా జరుగుతుందని జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.