ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):-
ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వివిధ శాఖ అధికారులకు సిఫారసులు చేశారు. కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు.ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో తిరస్కరణకు గల కారణాలను వివరంగా తెలుపుతూ అర్జిదారునికి అందజేయాలని సూచించారు. ఈ రోజు మొత్తం (33) దరఖాస్తులు రాగా, పెన్షన్ మంజూరు కోరుతూ, ఉపాధి కల్పించాలని, భూ సంభందిత సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
వెంకటాపురం మండలంలో భూమి సమస్యలకు పరిష్కారం
చూప్పాలన్నారు.ములుగు మండలం బండారుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ములుగు,బండారుపల్లి జంగాలపల్లి గ్రామలలో ప్రభుత్వ భూములను సర్వే చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎందుకు పింఛన్ మంజూరు కాలేదు వాటి వివరాలు వెనువెంటనే తెలుపాలని డిఆర్డిఓ సిబ్బందిని ఆదేశించారు.
ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుండి ఏటురునాగారం వరకు రోడ్డు, మేడారం నుండి పస్రా వరకు తాడువాయి నుండి మేడారం రోడ్డు ధ్వంసమైనచోట్ల మరమ్మతులు చేపట్టాలని ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జగన్నాధపురం నుండి ఎదిరా వరకూ రోడ్డు పనులు టెండర్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.
పశుసంవర్ధక శాఖ ద్వారా పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని అన్నారు. ఆ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేసి పశువుల సంరక్షణ కోసం వైద్యం అందించాలని సూచించారు.ఖరీఫ్ పంటలను కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి శిథిలావస్థలో నున్న గృహాలను అద్దె భవనంలోకి మార్చుటకు, కొత్త భవనాలను నిర్మాణం చేసుకొనుటకు ప్రతిపాదనలు పంపించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షి ప్ పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ పెండింగ్ లేకుండా చూడాలని జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లకు సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే పౌష్టికాహార కిట్లను రెండు నెలలకు సరిపడు విధంగా క్వాలిటీ ఆహారం ఐటమ్స్ తయారుచేసి అందించాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ డి ఆర్ ఓ కే రమాదేవి జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య డీఈఓ జి పానిని సిపిఓ ప్రకాష్ డిపిఓ వెంకయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు