ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ ఆన్‌లైన్ కనెక్టివ్ ఏర్పాటు చేయాలి: మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట బ్యూరో, మే 26: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ప్రాంతీయ రవాణా కార్యాలయంపై రూ. 1.60 కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ శాఖ ఆన్‌లైన్ కనెక్టివ్ ఏర్పాటు చేయాలని, జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాల్లో అక్కడికక్కడే స్థానికంగా ఆల్‌లైన్ సేవలు జరిపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. వారం పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 13వేల లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చామని, త్వరలోనే వారికి పర్మనెంట్ లైసన్సులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా రూరల్ మండలంలోని వివిధ కమ్యునిటీ భవనాల నిర్మాణాకి నిధుల మంజూరు చేసిన ప్రోసిండింగ్ పత్రాలను కుల సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పారుఖ్‌హుస్సెన్, ఎమ్మెల్యేలు సతీష్, యాదిగిరిరెడ్డి, ఆర్టీఏ జాయింట్ కమీషనర్ పాండు రంగం, జేడీపి రమేశ్, డీటీసీ వెంకటరమణ, సిద్దిపేట ఆర్టీఏ రామేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పోటోరైటప్: 26.4 అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా దుబ్బాక, మే 26: మండల కేంద్రమైనన దుబ్బాకలో పెద్ద చెరువు కట్టపై అక్రమంగా నిర్మిస్తున్న మోడల్ కూరగాయాల మార్కెట్ పనులను వెంటనే నిలిపి వేయాలని శనివారం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తహిసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ కట్టను ద్వంసం చేసి కూరగాయాల మార్కెట్ కట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కాంట్రాక్టర్ల జేబుల నింపడాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, టిడిపి నేతలు మచ్చ శ్రీనివాస్, అనంతుల శ్రీనివాస్, బాస్కర్, శ్రీరాం నరేందర్, ఎల్లం, రాములు, ఆకుల భరత్, రవి రాజిరెడ్డి, స్వామి, సాధిక్, కార్తిక్ పాల్గొన్నారు. పోటోరైటప్:26.5 రైతు బందు పథకం దేశ చరిత్రలో ఇదోక విప్లవాత్మాకం: మంత్రి హరీష్‌రావు సిద్దిపేట బ్యూరో, మే 26: రైతు బందు పథకం పంపిణీ భారత దేశ చరిత్రలో ఇదోక విప్లవాత్మాకమైన పని అని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు అన్నారు. పట్టదారు పుస్తకాలు, రైతు బందు పథకం పంపిణీపై శనివారం సిద్దిపేటలోని కొండభూదేవి గార్డెన్‌లో సమీక్ష నిర్వహింంచారు. దేశంలో ఏ సీఎం చేయని విదంగా మన సీఎం కేసీఆర్ ఈ మహత్తర భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారన్నారు. రైతు బందు పథకం ద్వారా సీఎం రైతులకు పెట్టుబడి డబ్బు ఇచ్చే గొప్ప కార్యక్రమం చేపట్టారన్నారు. తప్పులు సవరించి ఆర్హులైన రైతులకు పట్టదారు పుస్తకాలు, రైతు బందు చెక్కులను సమిష్టి కృషితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక స్పెషల్ అధికారి-ఐఏఎస్ చిత్త రామచంద్రన్, కలెక్టర్