ప్రణాళికాబద్ద అభివృద్దికి కేంద్రంగా తెలంగాణ
నాలుగేళ్ల అభివృద్ది మరింత ముందుకు సాగాలి
మళ్లీ కెసిఆర్ వస్తేనే తెలంగాణకు మోక్షం
ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి
ఆదిలాబాద్,నవంబర్22(జనంసాక్షి): కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండేందుకు వివిధ పార్టీలు, సంఘాల నుంచి భారీసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి అన్నారు. దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రచారం బాగుందని, కూటమి మాటలను నమ్మేస్తితిలో ప్రజలు లేరన్నారు. టిఆర్‌ఎస్ అంటే విశ్వసనీయత కలిగిన పార్టీ అన్నారు.
తెలంగాణ వస్తే చిమ్మచీకట్లు అని చెప్పిన ఓ పెద్దమనిషి ఇప్పుడు చీకట్లలో ఉన్నారని, రాజకీయ ఉనికి కోసం భవిష్యత్ అంధకారం అవుతుందనే భయంతో ప్రతిపక్షాలు అక్కసును వెళ్లగక్కుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సంక్షోభం లేకుండా చేశారని అన్నారు. త్వరలోనే ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారానీరు రాబోతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళలు ఎప్పుడు బిందెలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చేవారని, తాగేందుకు గుక్కెడునీళ్లు లభించక ట్యాంకర్లలో సరఫరా చేసేవాళ్లని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అభివృద్ధి గ్రోత్‌రేట్‌లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందుందని చెప్పారు. నియోజకవర్గాల్లోని అన్ని
చెరువులను నింపడం ద్వారా రైతులు రెండోపంట పండిస్తున్నారని చెప్పారు. వజనవరి 1నుంచి రైతులకు వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ మొదటిదిగా నిలిచిందన్నారు. రైతులకు ఎకరానికి రూ.4వేలు, యాసంగికి రూ.4వేలు చొప్పున ఏడాదిలో ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి అందింస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో మొదటిదిగా నిలవబోతుందని చారి స్పష్టం చేశారు. దీనిని పదివేలకు పెంచుతామని సిఎం కెసిఆర్ ఇప్పటికే హావిూ ఇచ్చారని అన్నారు. రెండేళ్లలో 540గురుకులాలు ప్రారంభించుకున్న ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేజీటుపీజీ ఎదీ అని విమర్శలు చేసే ప్రతిపక్షాలకు మైనార్టీ, గిరిజన గురుకుల పాఠశాలలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని.. రైతు ముఖంలో చిరునవ్వు చూసేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని చారి అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్న మేలును చూసి 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రైతుల కష్టాలు తెలిసిన మనిషి కేసీఆర్ అని, అందుకే పంట పెట్టుబడి కింద ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు అందిస్తున్నారన్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కేవారని, నేడు సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నడుం బిగించిన కేసీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రైతు బంధు సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.10వేలకు, ఆసరా పింఛన్ల ను రూ.2016కు పెంచుతారన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు రూ.3016 భృతిని అందజేస్తారన్నారు.