ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స
హైదరాబాద్: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బొత్స పిలుపు నిచ్చారు. నాయకత్వ మార్పునకు సంబంధించి వస్తున్న కథనాలన్నీ వూహాగానాలేనన్న బొత్స త్వరలో మంచి ప్రభుత్వం వస్తుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు తాను చూడలేదన్నారు. ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని మార్చే సర్వహక్కులు అధిష్ఠానానికి ఎప్పుడూ ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.