ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

బషీరాబాద్ ఆగస్టు 7,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున ఎంపిడిఒ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిడిఒ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు
స్వాతంత్ర భారత  వజ్రోత్సవాల పై వివిధ గ్రామాల సర్పంచ్ లకు, ఎంపీటీసీ కు మరియు పంచాయతీ కార్యదర్శిలకు హావగాహన కార్యక్రమం చేపట్టామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మొదటగా 09వ తేదీ ఆగస్టు 2022 నాడు జాతీయ జెండాలు పంపిణీ కార్యక్రమం.10వ తేదీ నాడు మొక్కలు నాటడం.11వ తేదీ నా కేవలం పోలీసులకు మాత్రమే ఫ్రీడమ్ రన్నింగ్ పెట్టడం జరుగుతుంది.12వ తేదీ నా రాఖీ పండుగను జాతీయ సమక్షంలో జరుపుకోవాలి. 13వ తేదీన జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ర్యాలీగా వెళ్లి జాతీయ బెలూన్స్ వదలాలి.14వ తేదీన జానపద కళాకృపల ప్రదర్శనం. 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అదేవిధంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాని ఎగర వేయాలని చెప్పారు.16వ తేదీన జనసంద్రత ఉన్న ప్రదేశాలలో జాతీయ గీతాలు పడాలి. 17వ తేదీన తాండూర్ మరియు వికారాబాద్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.18వ తేదీన  ఉద్యోగస్తులకు మరియు యువకులకు ఆట పోటీలు నిర్వహిస్తారు.19వ తేదీన ముసలి వాళ్లకు జైల్లో ఉన్న వాళ్లకు పండ్లు తీపి బండారం పంపిణీ కార్యక్రమం. 20వ తేదీన దేశభక్తి చాటుతూ వివిధ గ్రామాలలో మండలాలలో ముగ్గులు వేసే కార్యక్రమం. 21వ తేదీన ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.22వ తేదీన ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం గురించి ముగింపు కార్యక్రమం చేపడతామని ఎంపీడీవో రమేష్ క్లుప్తంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.