ప్రతి ఇంటి పై జెండా ఎగరాలి
ప్రతి గుండెలో జాతీయత నిండాలి
* బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ ( జనం సాక్షి ) :
ఈనెల 13 నుండి 15 వరకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలని, ముఖ్యంగా దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా హర్ గర్ తిరంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి కృషి చేయాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లో బిజెపి పదాధికారుల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆజాది క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్టీలు, రాజకీయాలకతీతంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో, ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి తగిన కృషి చేయాలన్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు . సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తిరంగా పండుగ మారు మోగే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. బిజెపి శ్రేణులు ప్రతి ఒక్కరు ప్రధాని మోడీ సూచన కనుగుణంగా తమ డిపి జెండా తో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా తిరంగా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాకల ప్రభాకర్ యాదవ్ , సాయిని మల్లేశం, ఎర్రబెల్లి సంపత్ రావు, గుర్రాల వెంకట్ రెడ్డి, మాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు చేపూరి సత్యం, రంగు భాస్కరాచారి, మంజుల వాణి, అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జాన పట్లస్వామి, గాజె రమేష్ ,సుధాకర్ పటేల్, చొప్పరి జయశ్రీ , పుప్పాల రఘు, కటకం లోకేష్,జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు ఇన్చార్జిలు పాల్గొన్నారు.