ప్రతి ఒక్కరు తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి.

11వ వార్డ్  కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)ఆజాద్ కా అమృత్ మహోత్సవ్  కార్యక్రమంలో భాగంగా సాయిపూర్ 11వ వార్డ్ లో బుధవారం ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని  మున్సిపల్  కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి
ప్రారంభించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో” భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo, ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపుమేరకు ప్రతి ఒక్కరు తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని తాండూరుమున్సిపల్  కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి  ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మున్సిపల్  కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి  మాట్లాడుతూ. ఆజాద్ కా అమృత్ ఉత్సవాలు,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని
భారత గడ్డ పై పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఈ వజ్రోత్సవాల సందర్బంగా రోజు వారీ కార్యక్రమాల్లో అందరూ విధిగా పాల్గొని రాబోయే యువతరనికి స్ఫూర్తినివ్వాలని తెలియచేశారు.
ప్రతి పౌరుడు భారత దేశ “ఫ్లాగ్ ఆఫ్ కోడ్” ను అనుసరిస్తూ జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.
జెండా గౌరవాన్ని దేశ ప్రతిష్టతను మరింత పెరిగేందుకు దోహదం చేసే విధంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి నిరటి శ్రీనివాస్, కృష్ణ ఆర్పీలు ,పట్లోళ్ల హారిక,అంగన్వాడీ టీచర్ పద్మావతి,శ్రీనివాస్, భాస్కర్  రమేష్  రవి  హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..