ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలి.
దైవచింతనంలొనే మానసిక ప్రశాంతత.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు జులై 12(జనంసాక్షి)
ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.తాండూరు పట్టణంలోని కొకట్ రోడ్ లో గల సాయి బాబా మందిరంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం బస్ స్టాండ్ సమీపంలోని తుల్జాభవని మాత ఆలయం నుండి సాయి బాబా మందిరం వరకు నిర్వహించిన సాయి బాబా రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాండూరు మున్సిపల్ వైస్
చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయి నాథుని చిత్రపటానికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాని ప్రారంభించారు .తాండూరు ప్రజలందరు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆమె కోరినట్లు తెలిపారు.కన్నుల పండుగగా సాగిన సాయి బాబా రథోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని దైవచింతనంలొనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.తాండూరు పట్టణం కొకట్ రోడ్ మార్గంలో గల సాయి బాబా మందిరం లో బుధవారం నాడు గురుపౌర్ణమి వేడుకలను హారతి,పుష్పభిషేకలతో మొదలుకొని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని భక్తి శ్రద్ధలతో పెద్దఎత్తున భక్తులు సాయినాథుని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తుంటారని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాయి సేవ సమితి వారు అని ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.ప్రతిఒక్కరు దర్శించుకొని సాయిబాబా వారి ఆశిషులు పొందాలని సాయినాథుని కృపాపత్రులు కాగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో తెరాస అధికప్రతినిధి రాజు గౌడ్ , సాయి పుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్,చంద్రకళ దంపతులు, సాయి సేవ సమితి ప్రతినిధులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.