ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలి

` కనీసం ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి
` ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ.దిల్లీలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న మోదీ.. రావణ దహనం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరూ పది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడాలని కోరారు. దిల్లీ ద్వారకాలోని డీడీఏ మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన రావణ దహనం చేశారు. ‘‘దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక. చంద్రుడిపై కాలుమోపిన రెండు నెలల తర్వాత ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. రావణ దహనం అనేది కేవలం రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయడమే కాదు. కులతత్వం, ప్రాంతీయత పేరుతో దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్న శక్తులకు సంబంధించినది కూడా. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేయడం కొన్ని తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. భారత్‌?లో ఆయుధ పూజ కేవలం తమ సంక్షేమం కోసమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం చేస్తారని అన్నారు. అంతకుముందు డీడీఏ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు రామ్‌? దర్బార్‌? విగ్రహంతో ఘనస్వాగతం పలికారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలు పోషించి వేదికపై రామ్‌?లీలా ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు మోదీ హారతులిచ్చారు. మరోవైపు, దిల్లీలోని ఎర్రకోటలో ధార్మిక లీలా కమిటీ ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రసంగించారు. ‘‘నేడు మనం అవినీతి నుంచి ఉగ్రవాదం వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్లను అధిగమించడానికి శ్రీరాముడి సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయి.