ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మండలంలోని ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలను దొంగతనాలను ఇతర నేరాలను అదుపు చేసుకోవాలని నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్ ప్రజలకు సూచించారు బుధవారం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సిసి కెమెరాల . సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు డిఎస్పి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ నెంబర్ లుఅడిగితే ఇవ్వకూడదని పేర్కొన్నారు ఎవరైనా సైబర్ నేరగాలి చెప్పే మాయమాటలు నమ్మి ఖాతా వివరాలు ఓటీపీ నెంబర్లు చెప్తే బ్యాంకులో ఉండే నగదును దోచుకెళ్తారని అందుకు గుర్తుతెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం తెలుపవద్దన్నారు అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాత్రి సమయాలలో దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడటం కాకుండా వాహన ప్రమాదాలు వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉందన్నారు ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతు ఎస్సై వెంకటేష్ సర్పంచ్ గంగారం అశోక్ తదితరులు పాల్గొన్నారు