ప్రతి చుక్కనీటిని సద్వినియోగం చేసువాలి

– తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం
– కాంగ్రెస్‌ నేతల వల్లే నల్గొండ జిల్లా వెనుకబాటుకు గురైంది
– తెలంగాణ అభివృద్ధిపై ఉత్తమ్‌, జానాలు చర్చకు సిద్ధమా?
– అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు కలలు కంటున్నారు
– రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి
నల్గొండ, జులై21(జ‌నం సాక్షి) : ప్రతి చుక్కనీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఎకరాకు
సాగునీరందించటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్గొండ డిండి ప్రాజెక్టు నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్టు పరివాహక రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడులేని విధంగా సీఎం కేసీఆర్‌ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి సాగునీటిని విడుదల చేశారని చెప్పారన్నారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. సమైక్య పాలనలో దేవరకొండ ప్రాంతం అధోగతి పాలైందన్నారు. కన్న బిడ్డలను అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయన్నారు. తెలంగాణ వచ్చాక దేవరకొండను బంగారు కొండగా మరుస్తున్నమన్నారు. ఫ్లోరైడ్‌ నిర్మూలన కోసం డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల  పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయన్నారు. నల్లగొండ అధోగతిపాలు కావడానికి కాంగ్రెస్‌ పార్టే కారణమని విమర్శించారు. జిల్లా నుంచి కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని జగదీష్‌రెడ్డి తెలిపారు. డిండి ప్రాజెక్టు రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్‌ కల్వకూర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి సాగునీటిని విడుదల చేశారు. తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు జానారెడ్డి, ఉత్తమ్‌ సిద్ధమా? అని మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ వాళ్లు పది జన్మలు ఎత్తినా డిండి కింద ఖరీఫ్‌లో నీళ్లు ఇవ్వలేరన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆయన మండిపడ్డారు. సాగర్‌ కింద మేజర్లకు చివరి భూములకు నీళ్లు ఇవ్వని దద్దమ్మలు కాంగ్రెస్‌ పాలకులని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలన వల్లే నల్లగొండ జిల్లా వెనకబడిందన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌, జెడ్పీ చైర్మెన్‌ బాలూ నాయక్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.