ప్రతి నెలలో మూడుసార్లు మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంక్ ను శుభ్రం చేయాలి.
– మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.
మర్పల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి) మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ తాగే విధంగా మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలని, గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకులను కచ్చితంగా నెలలో మూడు సార్లు శుభ్రం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజున మర్పల్లి మండల పరిధిలోని నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ మల్లికార్జునగిరిలో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గ్రామ కాలనీలో తిరిగి ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గ్రామంలో అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు సరి చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షుడు నాయబ్ గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లికార్జునగిరి సర్పంచ్ లక్ష్మయ్య, ఎంపీడీవో జనార్దన్ రెడ్డి, తహశీల్దార్ శ్రీధర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ మధుకర్, రాచయ్య, వసంత్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.