ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ వినియోగించుకోవాలి
ఎంఈఓ కొండారెడ్డి
మల్దకల్ నవంబర్ 26(జనం సాక్షి) మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం జరిగిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ట్రైనింగ్ లో పాఠశాలకు సంబంధించి వివిధ నిధులను ఆన్లైన్లో బిల్ సబ్మిట్ చేసి తీసుకునే విధానమును సర్వ శిక్ష అభియాన్ గద్వాల్ సిస్టం అనిలిస్ట్ భారతి ప్రొజెక్టర్ ద్వారా మల్దకల్, గట్టు మండలంలోని ప్రధానోపాధ్యాయులకు, ఎస్ఎంసి చైర్మన్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి కొండారెడ్డి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులకు సరైన బిల్స్ ను సబ్మిట్ చేస్తూ పాఠశాల నిధులను ఉపయోగించుకోగలరు అని తెలిపారు.ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించడం జరిగింది,ప్రతి ఉపాధ్యాయుడు సరైన టైమ్ కు పాఠశాలకు వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకోగలరు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్దకల్ సర్పంచ్ యాకోబు,మల్దకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియేల్, గట్టు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఓబులేష్,మాచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు,చాగదోన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రుక్మతుల్లా,మల్దకల్, గట్టు ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్లు,ఎంఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.