ప్రతి పౌర్ణమికి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి సూర్యాపేట డిపో నుండి స్పెషల్ బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ సూర్యాపేట డీఎం డి.సురేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రానున్న పౌర్ణమిని పురస్కరించుకుని జులై 31న సోమవారం ఉదయం 7 గంటలకు సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి సూపర్ లగ్జరీ బస్ బయలుదేరుతుందని తెలిపారు.మొదటగా కాణిపాకంలోని గణనాథుని దర్శనం అనంతరం అదే రోజు రాత్రికి 11 గంటలకు అరుణాచలంకు బస్ చేరుకుంటుందని చెప్పారు.ఆగస్టు 1న మంగళవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ, మధ్యాహ్నం తిరువన్నామలై నవ శివలింగాల దర్శనం ఉంటుందన్నారు. అనంతరం గోల్డెన్ టెంపుల్ కు చేరుకొని అక్కడ దర్శనానంతరం రాత్రి 7 గంటల సమయంలో తిరుగుప్రయాణమై మరుసటి రోజు ఆగష్టు 2న బుధవారం ఉదయం 9 గంటలకు సూర్యాపేట చేరుకోనున్నట్లు తెలిపారు.టిక్కెట్ ధర ఒక్కరికి రూ.3500గా నిర్ణయించడం జరిగిందన్నారు.ఈ అవకాశాన్ని సూర్యాపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం కోరారు.ఇక నుండి ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్ సర్వీస్ నడుపనున్నట్లు తెలిపారు.ప్రతి పౌర్ణమికి పది రోజులు ముందుగానే ఆన్ లైన్ లో అరుణాచల గిరి ప్రదక్షిణకు బస్ టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించి మందస్తు రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నట్లు తెలిపారు.గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందుగానే భక్తులను అరుణాచలంకు చేర్చనున్నట్లు తెలిపారు. యాత్ర బస్ బుకింగ్ కొరకు ఇంచార్జ్ ఏకాంబరం – 7382836177, అసిస్టెంట్ మేనేజర్ – 9032153066, డిపో మేనేజరు – 9959226306 సెల్ నెంబర్ లలో సంప్రదించవచ్చని తెలిపారు.