ప్రతి విద్యార్థి సేవా బావాన్ని పెంపొందించుకోవాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్

కేసముద్రం సెప్టెంబర్ 24 జనం సాక్షి / ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా బావాన్ని పెంపొందించుకోవాలని కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రం ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ అన్నారు. జాతీయ సేవా దినోత్సవం సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ పి ఓ క్రిష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ వాలింటర్ ల చే కళాశాల ఆవరణం లో పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించి పరిశుభ్రపరిచారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ మాట్లాడుతూ గాంధీ శతజయంతి సందర్భంగా అభివృద్ధి కొరకు యువత పాత్ర కీలకంగా ఉండాలనే ఉద్దేశ్యం తో అప్పటి భారత ప్రభుత్వం 1969 సంవత్సరం సెప్టెంబర్ 24 న అధికారికంగా ప్రారంభించారని ఈ కార్యక్రమం ద్వారా నాట్ మి బట్ యూ (నా కోసం కాదు మీ కోసం)అనే లోగో తో యువత సమాజ సేవ చేయాలని సూచించారు. క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వలన ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత, మురికి కాల్వల శుభ్రం చేయుట,నిరక్షరాస్యులకు అక్షరాస్యత చేపించటం ,రక్తదాన శిబిరాలు,మూఢ నమ్మకాలపై నాటికలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో సమాజ సేవ చేస్తారని తెలియజేశారు.కార్యక్రమంలో అధ్యాపక బృందం వెంకట గిరి,రమేష్ బాబు, సంతోష్,కొమ్మాలు, వీరన్న,ప్రసాద్,బాలకృష్ణ, జ్యోతి, రాజు,రాజశేఖర్, మధు అధ్యాపకేతర బృందం నరేష్ ,తాజుద్దీన్, లీల,వేణు,ఎన్ఎస్ఎస్ వాలింటర్ లు ఉపేందర్,భరత్, బిందు,త్రిష,రాజేశ్వరి, రమేష్,కార్తిక్, యుగేందర్, పాల్గొన్నారు.