ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి.

యజ్ఞాలు చేయడం వల్ల వాతావరణంలో మార్పులు.
 ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు జులై 30(జనంసాక్షి)ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.శుక్ర వారం తాండూరు పట్టణంలోని ఆర్యసమాజ్ మందిరం లో శ్రావణ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన యజ్ఞంలో  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని, యజ్ఞాలు చేయడం వల్ల కాలుష్యం నియంత్రణ అయితుందని, ప్రజలు అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండేందుకు యజ్ఞాలు ఉపయోగపడతాయని అన్నారు. యజ్ఞాలు చేయడం వల్ల వాతావరణంలో మార్పులు జరిగి పకృతి మనకు అనుకూలిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావనతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి రాజు గౌడ్, సీనియర్ నాయకులు నర్సింహులు,
పోట్లీమహారాజ్ ఆలయ చైర్మన్ రాజన్ గౌడ్, నగరేశ్వర్ టెంపుల్ చైర్మన్ కుంచెం మురళి, ఆర్యసమాజ్ కమిటీ సూర్య ప్రకాష్ ప్రధా న్, మోహన్ కుమార్ మంత్రీ, రమేష్ రావు ప్రచార మంత్రి, కమలాకర్ సెక్రెటరీ, శివాజీ రావు, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.