ప్రత్యేక¬దాపై టిడిపి వైఖరి వెల్లడించాలి: డిసిసి

అనంతపురం,మే7(జ‌నంసాక్షి): ఎపికి ప్రత్యేక¬దా రాదని తెలిసినా ఇంకా అధికార టిడిపి మభ్య పెడుతూ నెట్టి  కాంగ్రెస్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ అన్నారు. టిడిపి,బిజెపిలు కలసి రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక¬దా కోసం ఏం చేయబోతున్నారో అధికార టిడిపి వెల్లడించాలని, అలాగే బిజెపి కూడా తన వైఖరి చెప్పాలని అన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న నూతన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులను ఆపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కరవునివారణ చర్యలు మృగ్యమయ్యాయన్నారు. అధికార పార్టీ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకుడుగుంతల తవ్వకంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా  కరవును పారదోలేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదన్నారు. పశుగ్రాసం కేంద్రాలు లేకపోవడంతో రైతులు పశువులను కబేళాలకు తరలిస్తున్నారని, గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోను నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చిందని ఆరోపించారు. జిల్లాలోని రైతులు పొట్టకూటి కోసం పక్క రాష్టాల్రకు వలసలు వెళుతున్నారని అన్నారు.  జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.  ప్రభుత్వం పోలీసుయంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. జిల్లాలో హత్యలు, నేరాలు, భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.  కోట్ల విలువైన భూములపై భూకబ్జాదారులు కన్నేశారని, అలాంటి భూముల క్రయవిక్రయాలు వెంటనే ఆపాలన్నారు. ప్రబుత్వాలు రాజకీయాలు, రాబడి గూర్చి ఆలోచిస్తున్నారేగాని కరవును పట్టించుకోవడంలేదన్నారు.

తాజావార్తలు