ప్రత్యేక తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గద్దె దిగితేనే ప్రజలకు మేలు

తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్‌ కీలక భూమిక

కాళేశ్వరం కెసిఆర్‌కు ఎటిఎంలా మారింది

డిజైన్‌ లోపాల వల్లనే కాళేశ్వరం మునక

తెలంగాణలో బిజెపి జంగ్‌ సైరన్‌ మోగించింది

వచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న కేంద్రమంత్రి షెకావత్‌

కెసిఆర్‌ కుటుంబాన్ని వదిలేది లేదన్న కిషన్‌ రెడ్డి

యాదాద్రి భువనగిరి,అగస్టు2 ( జనంసాక్షి ) : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దె దిగితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ జంగ్‌ సైరన్‌ మోగించిందని..వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్‌ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్‌ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..కేసీఆర్‌ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్‌కు గిట్టదన్నారు. యాదగిరిగుట్టలో బండి సంజయ్‌ ప్రాంభించిన  బీజేపీ ప్రజా సంగ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్‌.. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలిపారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బండి సంజయ్‌ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారని..మూడవ విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇంజనీరింగ్‌ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పంపు హౌస్‌లు మునిగాయన్నారు. కవిూషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌  కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేసీఆర్‌కు డబ్బు సంపాదించే మిషన్‌గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్‌… ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ప్రతిస్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. దేశాన్ని ఏళ్లుగా పాలించిన వాళ్లు ప్రజలను పట్టించుకోలేదని షెకావత్‌ అన్నారు. దళితుడైన రాంనాథ్‌ కోవింద్‌ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే

దక్కిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబహితమే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ఆయన..ప్రపంచంలో భారత్‌ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. అడుగడుగునా ప్రశ్నిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడిరచారు. తెలంగాణ గడ్డపై కుటుంబ పాలనను ప్రజలు పాతర పెడుతారని తెలిపారు. సంవత్సరం తర్వాత.. మార్పు తప్పకుండా వస్తుందని.. అధికారులు తెలుసుకోవాలని.. చట్టప్రకారం పని చేయాలని వారికి సూచించారు. ఉన్న గద్దె ఊడిపోయే పరిస్థితి వచ్చిందని.. ఢల్లీిలో గద్దెనెక్కేది తర్వాత ఆలోచించాలన్నారు. అన్యాయంగా వ్యవహరిస్తే.. ప్రజలు క్షమించరన్నారు. బండి సంజయ్‌ నిర్విహిస్తున్న పాదయాత్రను ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్‌ సర్కార్‌ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదని, అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపం ఈ ప్రభుత్వమని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది తెలంగాణ సర్కార్‌ అని విమర్శించారు. ధర్మాన్ని, న్నాయాన్ని పక్కన పెట్టి నా రాజ్యం అంటూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం, సచివాలయం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారని.. వీరంతా ప్రజలను కలుస్తారని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం మాత్రం ప్రజలను కలవరని వ్యాఖ్యానించారు. ఇక్కడ రైతులు నష్టపోతుంటే.. పంజాబ్‌ రాష్టాన్రికి వెళ్లి డబ్బులు ఇస్తారని విమర్శించారు. రైతుల దగ్గరి నుంచి వడ్లు కొంటున్నామంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. రూ. 1300 ఎంఎస్‌ పీ ఉంటే.. ఏడు సంవత్సరాల్లో రూ. 2 వేల 060 చేశామని..రైతులకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో, దళితుడిని ముఖ్యమంత్రి చేయడం.. దళితులకు న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే హావిూలిచ్చి అనంతరం మరిచిపోతారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేశారో లెక్కలేదన్నారు. మజ్లిస్‌ పార్టీకి కీలుబొమ్మగా మారిందని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందుకే నిర్వహించడం లేదన్నారు. యూరియాకు రూ. 3,700 సబ్సిడీ ఇస్తున్నట్లు, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తే..అవి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ ఇస్తామని కేంద్రం చెబుతుంటే.. వారి డేటాను పంపించకపోవడం దారుణమన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు రూ. 20 వేల కోట్లు కేటాయించి పనులు చేయిస్తున్నామన్నారు. అలాగే లక్షా 4 వేల కోట్లు జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఈ రోడ్లపై తెలంగాణ ప్రజలు తిరగడం లేదా ? అని ప్రశ్నించారు. భువనగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. రూ. 900 కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు.. త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. దీనిపై ఓ మంత్రి విమర్శలు చేస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనత్‌ నగర్‌ లో ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ రన్‌ చేస్తున్నట్లు.. ఎంఎంటీఎస్‌ సెకండ్‌ ఫేజ్‌ కు డబ్బులు కేటాయించడం లేదని విమర్శించారు. వరంగల్‌ లో రైల్వే కోచ్‌ పనులు ఆగిపోయాయని, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పెడితే.. ప్రొడక్షన్‌ ఆపి వేయడం దారుణమన్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్న విషయాన్ని గుర్తు

చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ లో ఉన్న వాళ్లందరూ స్వార్థపరులని, తెలంగాణ వద్దన్న వారు ప్రభుత్వంలో ఉన్నారని విమర్శించారు.  బీజేపీ పార్టీపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు.

తాజావార్తలు