ప్రత్యేక తెలంగాణ వస్తుండగా ఫ్రంట్ అవసరమేంటి : జానారెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుండగా ఫ్రంట్ అవసరమేంటని మంత్రిని జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వస్తుందన్న సంకేతాలు తమకున్నాయని, డిసెంబరు 9 కన్నా ముందా తర్వాతా అన్నది చూడాలని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సంతోషమే కదా అని మంత్రి అన్నారు.