ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి

 హైదరాబాద్

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై తెలంగాణ ఎంపీలు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును రాష్ట్రపతి నోటిఫై చేయాలన్నారు. మరో ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ సైతం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.