ప్రధానితో కశ్మీర్‌ విపక్ష నేతల భేటీ

దిల్లీ: కశ్మీర్‌ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ప్రధాని మోదీతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను ప్రధానికి వివరించారు.

పెల్లెట్‌ తుపాకీల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలు కోరారు. ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. కశ్మీర్‌ అంశంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని.. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశముందని విపక్ష నేతల బృందం వివరించింది.