ప్రధానిని విమర్శిస్తారా!
` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు
న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవుల యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియునా,మంత్రులు మల్షా షరీఫ్, మహ్జుం మజీద్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ ఉదంతాన్ని మాల్దీవుల ప్రభుత్వ దృష్టికి భారత్ తీసుకువచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం ఖండిరచింది. వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా, మరియం షియునా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫొటోలను సోషల్ విూడియాలో పోస్ట్ చేసిన మోదీపై వ్యంగ్యోక్తులకు తెగబడిరది. మోదీని విదూషకుడని, తోలుబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆపై సదరు పోస్ట్‌ను డిలీట్ చేసింది.ప్రధాని లక్షద్వీప్‌లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ విూడియా వేదికగా పలు ఫొటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియునా మోదీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ విూడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్‌లను డిలీట్ చేసింది. దీంతో మాల్దీవుల్లో భారత హై కమిషనర్ ఈ అంశాన్ని మహ్మద్ మిజు నేతృత్వంలోని మాలే సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ సైతం ప్రధాని మోదీపై మరియం షియునా అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఆమె అసహ్యమైన పదజాలం వాడారని అన్నారు. మాల్దీవులకు కీలక భాగస్వామ్య దేశాధినేత పట్ల మంత్రి మరియం షియునా తీరు మాల్దీవుల భద్రత, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు.. మంత్రి వ్యాఖ్యల పట్ల మహ్మద్ మిజు ప్రభుత్వం దూరం పాటించాలని, ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించేవి కాదని భారత్ సర్కార్‌కు స్పష్టం చేయాలని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.
అసలేంజరిగిందంటే..ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో గత వారం పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. అనంతరం సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు.సాహసాలు చేయాలనుకునే వారు.. తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ.. అక్కడి ఫొటోలను షేర్ చేశారు. ఈ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనిపై మాల్దీవులు ఎంపీ జహీద్ రవిూజ్ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే.. లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు.’’పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని జహీద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. భారత్ నుంచి ఏటా ఎంతో మంది ఆ దేశంలో పర్యటిస్తుంటారు. ఈ నేపథ్యంలో జహీద్ వ్యాఖ్యలు అక్కడి పర్యాటక రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్‌ను ఉద్దేశించి జహీద్ చేసిన వ్యాఖ్యలపై మాల్దీవులు విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘’ఒక దగ్గర నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటితో మాల్దీవులు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవి పూర్తిగా వారి వ్యక్తిగతం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉపయోగించాలని మాల్దీవులు ప్రభుత్వం విశ్వసిస్తోంది. అంతర్జాతీయ భాగస్వాములతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినేలా విద్వేషపూరిత, వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం వెనుకాడదు’’ అని ప్రకటనలో పేర్కొంది.