ప్రధాని మన్మోహన్, సోనియాకు కరుణానిధి లేఖ
చెన్నై : శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానాన్ని భారత్ సమర్థించకపోతే యూపీఏలో కొనసాగే ప్రసక్తిలేదని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అమెరికా తీర్మానంలో జాతి నిర్మూలనకు పాల్పడిన అంశాన్ని పొందుపరిచేలా ఒత్తిడి తేవాలని కోరారు.