ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు సంపద, సంతోషాలను తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. రైతులకు ఇది ప్రధానమైన పండుగని.. వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తొందని ఒక ప్రకటనలో తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రైతు పాత్ర కీలకమని పేర్కొన్నారు.