ప్రధాని, సోనియా బహిరంగ చర్చకు రావాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ తనతో బహిరంగ చర్చకు రావాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. అయితే ఈ సవాలు విసిరిన కొద్ది సేపటికే దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. కేజ్రీవాల్ సవాల్‌నను స్వీకరిస్తున్నానని బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు దిగ్విజయ్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధుల రాకపై అనుమానం వ్యక్తం చేస్తూ దిగ్విజయ్ శుక్రవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. భాజపా పాలిత రాష్ట్రాల్లో అవినీతిని ఎందుకు ప్రశ్నించడం లేదని కేజ్రీవాల్‌ను ఆయన ప్రశ్నించారు.