ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢల్లీి
` 12 ఏళ్ల ఆయుష్యు తగ్గనున్న స్థానికులు
` యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం
` దేశంలో తీవ్ర కాలుష్య పరిస్థితుల్లోనే 67 శాతం మంది ప్రజలు
` ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రపంచంలోనే అత్యంత అధిక కాలుష్యం ఉన్న నగరంగా ఢల్లీి నమోదు అయ్యింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 12 ఏళ్లు తగ్గిపోనున్నట్లు స్టడీ పేర్కొన్నది. చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్‌టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌పై డేటాను రిలీజ్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు ఆరోగ్య స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు తెలిపారు.దేశంలో 67 శాతం మంది తీవ్ర కాలుష్య పరిస్థితుల్లోనే రోజులు గడుపుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూషన్ డబ్ల్యూహెచ్‌వో సూచించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. ఒకవేళ కాలుష్య తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే అప్పుడు జీవితకాలం 3.1 సంవత్సరాలు తగ్గనున్నదని రిపోర్టు తెలిపింది.ఢల్లీి ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని రిపోర్టులో తెలిపారు. వాహనాలు, నిర్మాణాలు, వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాలుష్య వాయువులను పీల్చడం వల్ల బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల ప్రజలు ఆరేళ్ల వరకు తమ జీవితకాలాన్ని కోల్పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో ఈ వివరాలు వెల్లడిరచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కాలుష్య స్థాయిలకంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని తెలిపింది. దిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న ఏక్యూఎల్‌ఐ.. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని తెలిపింది. అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు (పీఎం2.5) డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే ఏడురెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల ఆయుస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది.ఉత్తరాదిన కాలుష్యానికి భౌగోళిక, వాతావరణ అంశాలు కారణమైనప్పటికీ.. మానవ ప్రమేయంతోనూ భారీ స్థాయిలో కాలుష్యం పేరుకుపోతోందని తెలిపింది. దేశంలో మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడి జనాభా సాంద్రత మూడురెట్లు ఎక్కువగా ఉండటం, తద్వారా వాహనాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతోందని పేర్కొంది.