ప్రపంచ కప్ నకు ఇదీ భారత జట్టు
న్యూఢిల్లీ: త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడకు చోటు లభించింది. కాగా గత ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు మొండిచేయి ఎదురైంది. ఆల్ రౌండర్ జడేజాను జట్టులోకి తీసుకోవడంతో యువీకి చోటు దక్కలేదు. ఇక మురళీ విజయ్, రాబిన్ ఊతప్పలకు కూడా స్థానం లభించలేదు.
భారత జట్టు:
ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్