ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

, జూలై 11(జనంసాక్షి): కుటుంబ నియంత్రణ పాటించు, ప్రగతికి నూతన అధ్యాయం లిఖించు
అనే నినాదంతో వైద్య సిబ్బంది మండలంలోని రేపాల గ్రామంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, శాశ్వత కుటుంబ నియంత్రణ మరియు తాత్కాలిక పద్ధతులు పాటించే దంపతులు తమ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. జనాభా నియంత్రణలో ఆరోగ్య శాఖ వారు చేస్తున్న కృషి ఎంతో అమోఘమైనదని కొనియాడారు. వైద్య సిబ్బంది ఒక స్త్రీ గర్భిణీ ఐన నాటి నుండి డెలివరీ అయ్యి పిల్లలకు సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు వేపించడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించే వరకు వారి యొక్క బాగోగులు చూస్తున్న వైద్య సిబ్బంది కృషి అభినందనీయమని తెలిపారు. దంపతులు తాత్కాలిక పద్ధతులు మరియు శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించి జనాభా పెరుగుదలను అరికట్టాలని పిలుపునిచ్చారు. బిడ్డ బిడ్డకు మూడు సంవత్సరాల వ్యవధి పాటించాలని, అధిక జనాభా అనర్థాలకు మూలం – చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, తల్లికి పోషణ బిడ్డకు ఆరోగ్యం,
చిన్న పిల్లల పెళ్లిళ్లు – నరకానికి వాకిళ్లు, జనాభా పెరుగుదల మానవ ప్రగతికి అరుగుదల, బాల్య వివాహాలు చట్టం రీత్య నేరం, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, బిడ్డ బిడ్డకు ఎడం – తల్లి బిడ్డలకు వరం అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఆర్ వినోద, ఏఎన్ఎంలు పద్మ ,పావని, ఆశవర్కర్లు జ్యోతి, రమణ, గ్రామప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు