ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం.
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 21. (జనంసాక్షి). ప్రపంచ డౌన్ సింద్రోామ్ డే సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆర్ ఎ పి ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్ రావు అధ్యక్షతన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీధర్ రావు మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన వ్యాధి అని అన్నారు. వ్యాధి ఉన్న పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా ఉండదని తెలిపారు. డాక్టర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ వ్యాధిని ముందుగానే గుర్తించి సొసైటీకి భారం కాకుండా కాకుండా పిల్లల ఎదుగుదలకు అందరూ సహకరించాలని కోరారు. డాక్టర్ సురేందర్ బాబు మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ కలిగిన పిల్లల్లో ఒక ప్రత్యేకమైన అభిరుచులు నైపుణ్యం ఉంటుందని వాటిని గుర్తించి వారి ఎదుగుదలకు తోడ్పాటు ను అందించాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సాయికుమార్ ,డాక్టర్ శ్రావణ్ రెడ్డి, డాక్టర్ నలిని, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ ఉమేష్ ,డాక్టర్ నికిత తదితరులు పాల్గొన్నారు.