ప్రపంచ మాతృమూర్తి మదర్ థెరిస్సా.
విద్యార్థి దశనుండే సమాజ సేవ పట్ల లక్ష్యాన్ని ఎంచుకోవాలి.
తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ సోషల్ వర్కర్ వెంకట్.
తాండూరు అగస్టు 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా కోట్పల్లి కే.జి.బి.వి బాలికల పాఠశాలలో
శుక్రవారం ప్రపంచ మాతృమూర్తి . నోబేల్ బహుమతి గ్రహీత సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ సోషల్ వర్కర్ వెంకట్, కరాట మాస్టర్ మనోహర్. పాఠశాల ప్రత్యేక అధికారిని పల్లవి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసిన నివాళ్లు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ సోషల్ వర్కర్ వెంకట్ మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశానికి వచ్చి ఎందరో అభాగ్యులకు కుష్టి రోగులకు సేవలందించిన ప్రపంచ మాతృమూర్తి మదర్ థెరిస్సా ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రజలకు సేవ చేయాలని అనే సంకల్పంతో విదేశీ నుండి వచ్చి కలకత్తాలో సేవలు ప్రారంభించినారు.సేవ లో నోబెల్ బహుమతి పొందిన ఘనత ఆమెది విద్యార్థులు ఆమె జీవిత చరిత్రను చదివి తమ తోటి వారికి తమకు తోచిన విధంగా సహాయం చేయాలన్నారు. విద్యార్థి దశ నుండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తయారు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ మనోహర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలన్నారు దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పల్లవి మాట్లాడుతూ మదర్ థెరిస్సా జన్మదినాన్ని పురస్కరించుకొని మాపాఠశాలలో నిర్వహించడం చాలా గర్వంగా ఉందని విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల విద్యార్థులకు సమాజం పట్లఅవగాహన పెరిగి భవిష్యత్తులో సేవ చేసే గుణాన్ని అలవర్చుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, ఫాతిమా బేగం ,అనూష తస్లీమ్ ,సరిత ,హైమావతి భ్రమరాంబిక ,సౌజన్య అశ్విని విద్యార్థులు పాల్గొన్నారు.