ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని సందర్భంగా ప్రతి జిల్లాకు 5లక్ష రూపాయలు కేటాయించాలి -టివీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నవంబర్ 15( జనం సాక్షి)డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లాకు 5 లక్ష రూపాయలు కేటాయించాలి అని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు అన్నారు.
మంగళవారం వికలాంగుల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
ప్రపంచ వికలాంగుల దినోత్సవంను కరోనా సమయంలో ఘనంగా నిరవహించలేక పోయామని ఈ సంవత్సరం ఘనంగా నిర్మించుకుందాం అన్నారు .
ప్రపంచ వికలాంగ దినోత్సవం . వికలాంగులకు సంబంధించి ఆటలు ,పాటల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పండుగ వాతావరణంలో నిర్మించాలని జిల్లాకు రూ.500,000/- కేటాయించాలని జిల్లాలలో కాకుండా మండల స్థాయిలో గ్రామస్థాయిలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరపాలని అలాగే గ్రామ స్థాయి కూడా బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ వికలాంగుల వేదిక తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల దినోత్సవం మీటింగ్ కు హాజరుకావలన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ఏ రోజు కూడా వికలాంగుల వారోత్సవానికి అటెండ్ కానీ ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈసారైనా మా వికలాంగుల సమస్యల పైన దృష్టి సాధించి ఈ వారోత్సవానికి ముఖ్యమంత్రి రావాలని తెలంగాణ వికలాంగుల వేదిక విజ్ఞప్తి చేస్తుంది అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అలాగే 33 జిల్లాలలో ఉన్న జిల్లాకు ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక ప్రచార కార్యదర్శి ప్రభాలత, సహాయ కార్యదర్శి కొనింటి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.