ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే పేదలే ఆక్రమించుకుంటారు.

 

సిపిఎం పార్టీ అధ్వర్యంలో రిలే దీక్షలు
జిల్లా కార్యవర్గ సభ్యలు ఎల్. దేశ్యానాయక్

 

అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 21, (జనం సాక్షి న్యూస్ ) : పట్టణంలో ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,  స్థలాలు ఉన్న పేదలకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యలు ఎల్. దేశ్యానాయక్ డిమాండ్ చేశారు.
ఆదివారం పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద సిపిఎం పార్టీ అధ్వర్యంలో పేద ప్రజల తో కలిసి రిలే దీక్ష లు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ్యానాయక్ మాట్లాడుతూ..
గతంలో సిపిఎం పోరాటల ఫలితంగా పట్టణంలో 1142 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు వచ్చాయని. పేదలకు పట్టాలు ఇచ్చిన ఈ స్థలాలలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకుండా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం తోకాలయాపన చేస్తున్నారని, వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు, ఈ నెల 23.వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని అప్పటికి అధికారుల నుంచి స్పందన రాకపోతే..
24.తేదిన పేదలు డబుల్ బెడ్ రూమ్ లను అక్రమించుకుంటారని హెచ్చరించారు.ఈ విషయంలో పోలీస్ కేసులకు భయపడే ప్రసక్తేలేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మున్సిపాలిటీ ఎన్నికలలో పట్టణంలోని ఇండ్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఈ మేరకు
పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.. లేదంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.రిలే దీక్షలో యాదమ్మ, బాలమణి, లక్ష్మమ్మ , పార్వతమ్మ,లు కూర్చున్నారు. కార్యక్రమంలో ,సిపిఎం మండల కార్యదర్శి ఎస్.మల్లెష్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, ఉస్సెన్ , జాను, తుల్జాభవాని తదితరులు పాల్గొన్నారు.