ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుంటే పేదలే స్వాధీనం చేసుకుంటారు.

యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తగుల అంజి యాదవ్

అచ్చంపేట ఆర్ సి, ఆగస్టు 23( జనం సాక్షి న్యూస్) ;- 2013 సర్వేనెంబర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 2011 సంవత్సరంలో పట్టాలు పొందిన లబ్ధిదారుల కేటాయించాలని పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుండి 23 వరకు చేపట్టిన రిలే దీక్ష కు యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తగుళ్ళ అంజి యాదవ్ మద్దతు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్యమ సమయంలో 2014 ఎలక్షన్ల కంటే ముందు పలు సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని దీంతోపాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రస్తావన చేస్తూ ఇరుకుగా ఉన్న ఇంటిలో ఒక కుటుంబం ఎలా ఉంటారని నిరుపేదలకు తెలంగాణ వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ కట్టిస్తానని చెప్పి ఎనిమిదేళ్లు గడుస్తున్న ఇప్పటికీ డబుల్ బెడ్ రూములు ఇచ్చిన దాఖలాలు లేవు అందుకు ఈ రిలే దీక్ష సాక్ష్యం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానన్న హామీని నెరవేర్చాలని అన్నారు. లేనిపక్షంలో ఈ నిరుపేద ప్రజలే స్వయంగా ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను స్వాధీనం చేసుకుంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.