ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
వేమనపల్లి,అక్టోబర్ 22,(జనంసాక్షి):
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వేమనపల్లి మండల నూతన కార్యవర్గ సమావేశాన్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి సయింపు శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వేమనపల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.ఈ ఎన్నికల పరిశీలకులుగా ఆర్.ఎస్.ఎస్ చెన్నూరు ఖండ కార్యవాహ రత్న లక్మీనారాయణ రెడ్డి హాజరయ్యారని తెలిపారు.ఈ ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యులులింగంపల్లి సత్యనారాయణ,దాసరి మల్లేష్ లను,వేమనపల్లి మండల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులుగా దుద్దిళ్ల పురుషోత్తం,మండల అధ్యక్షులుగా దుర్గం చందు,ప్రధాన కార్యదర్శి బాణావత్ సుధాకర్,ఉపాధ్యక్షులు ముద్దు గోపీకృష్ణ,ఆర్థిక కార్యదర్శి వాగావత్ వినోద్,కార్యదర్శి హరికుమార్ మహిళా కార్యదర్శి అజ్మీర సరిత ను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని,కాంప్లెక్స్ పాఠశాలలకు జూనియర్ అసిస్టెంట్,రికార్డ్ అసిస్టెంటు పోస్టులను మంజూరు చేయాలని అన్నారు.మధ్యాహ్న భోజన విధుల నుండి ప్రధానోపాధ్యాయులను తప్పించి ఏజెన్సీ లకు అందించాలని అన్నారు.గత విద్యా సంవత్సరంలో మార్చి20న పాఠశాలలకు నిధులు ఇచ్చి ఏప్రిల్ మొదటి వారంలో వెనుకకు తీసుకున్న నిధులను పాఠశాలలకు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకు నిదులు ఇవ్వకుండా పాఠశాలలను ఏ విధంగా నడపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.