ప్రభుత్వం విఫలం : విద్యార్థులు

ఆదిలాబాద్‌, జూలై 31 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ విద్యార్థుల వేదిక నాయకులు రాఖేష్‌, స్వామిలు ఆరోపించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలను కుదించేందుకు కుట్ర పన్నుతుందని వారు విమర్శించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 8న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల తరగతులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.