ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సిపిఎం జిల్లా రైతు అద్యక్షులు గంగాధర్.

కోటగిరి అక్టోబర్ 14 జనం సాక్షి:-ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యన్ని ప్రభుత్వం తాస్కారం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ రైతు విభాగం అద్యక్షులు గంగాధర్ అప్ప పేర్కొన్నారు.శుక్రవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని చావిడి వద్ద కోటగిరి మండల సిపిఎం పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు
తూ రైతులు పండించిన పంటలు చేతికి వచ్చిన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం వలన రైతులు దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.కావున రైతులు దళారుల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.గత రెండు సీజన్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టం చెందిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నా రు.కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన పలు రైతు సబ్సిడీ లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన వరి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు.రైతు రుణ మాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.రాబోయే రబీ సీజన్కి సంభందిం చిన విత్తనాలు,ఎరువులను సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు నాగలక్ష్మి,సిపిఎం పార్టీ మండల అద్యక్షులు లక్ష్మణ్,మండలి కమిటీ సభ్యురాలు జయ రైతులు,తదితరులు పాల్గొన్నారు.