ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహిస్తాం
ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ ఉదయం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన గంటా.. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. ఖాళీలను అందిస్తే వెంటనే భర్తీ చేయడానికి రెడీ అని వెల్లడించారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ఉంటుందని చెప్పారు. గత ఏడాది తొమ్మిది నోటిఫికేషన్లతో రెండు వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.