ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు విలేకరులు

కరీంనగర్‌, జూలై 27 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు పతిక్ర విలేకరులను ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ టి.సురేంద్ర అన్నారు. మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత విలేకరుల అవగాహన సదస్సుకుశుక్రవారం నాడు సురేంద్ర ముఖ్యమంత్రిగా హాజరైన్నారు. ప్రజలకు మంచి వార్తలను అందించే విధంగా విలేకరులు పనిచేయాలని తమ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. అనవసరపు వ్రాతలు రాయకుండా ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా వారి మన్ననలు పొందాలని అన్నారు. వివాదస్పద వార్తలకు చోటు ఇవ్వకుండా విలేకరులు జాగ్రత్త పడాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయం, విద్యుత్‌, తాగునీటి సమస్యలతో పాటు మిగిలిన మౌలిక సదుపాయాలపై పూర్తి అవగాహన ప్రతి విలేకరి కలిగి ఉండాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను వ్రాయలని ఆయన కోరారు. శాతవాహన కళాశాల వైస్‌ ఛాన్సెలర్‌ రామిరెడ్డి మాట్లాడుతూ, విలేకరులు గొప్ప వారన్న భవన ప్రజల్లో ఉందని, ప్రజలకు అనుకులమైన, ఉపయోగపడే వార్తలను అందించాలని అన్నారు. ఉన్నతమైన శ్రాస్త వేతల వివరాలను ప్రచురించాల్సిన విషయం విలేకరులపై ఉందని అన్నారు. తమ ఇష్టా రాజ్యంగా వార్తలు రాయవద్దని ఆయన విలేకరులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమి కార్యదర్శి సన్యాసిరావు, ఆర్‌కెడి మనోహరచారి, పత్రిక విలేకరులు పాల్గొన్నారు.