ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి హామీ బడ్జెట్ ప్రణాళిక గ్రామ సభ ద్వారా ఆమోదించిన గుమ్మడవల్లి సర్పంచ్

 గుండెబోయిన లింగం యాదవ్ కొండమల్లేపల్లి నవంబర్ 9 (జనం సాక్షి) న్యూస్ : మండల కేంద్రంలోని గుమ్మడవల్లి గ్రామంలో బుధవారం నాడు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు పూర్తయ్యేలా గ్రామ ప్రజలకు రైతులకు ఉపాధి హామీని కల్పించేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసే పనులను గుర్తించి గ్రామ సభ ద్వారా లేబర్ బడ్జెట్ ఆమోదించడమైనదని సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు నిబంధనల ప్రకారమే లేబర్ బడ్జెట్ రూపకల్పన చేసి నిర్దేశిత లక్ష్యం మేరకు కూలీల పని దినాలు కల్పించి చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, కంపోస్ట్ షెడ్డు, ఉద్యాన శాఖ, ప్లాంటేషన్ పనులు, జల సంరక్షణ, నీటిని వృధా అరికట్టే పనులను, చెట్ల పెంపకం, రహదారి నిర్మాణ పనులు, ఫామ్ పౌండ్, మరుగుదొడ్లు, గొర్రెల షెడ్లు, బర్రెల షెడ్లు, లాంటి ఎన్నో పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వినియోగించుకోవాలని గ్రామసభలో సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అసంపూర్తి పనులపై చర్చించి జాబ్ కార్డుల అప్ డేషన్ , పౌర సమాచార బోర్డుల తయారీ, సామాజిక తనిఖీల పై చర్చలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, గుమ్మడవల్లి గ్రామ ఉపసర్పంచ్ ముక్కమళ్ళ రాజలింగం యాదవ్, గ్రామ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ వర్కాల సత్యనారాయణ, గ్రామ వార్డు సభ్యులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు