ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం
డయాగ్నస్టిక్ సెంటర్లతో మారుతున్న వైనం
నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ స్కీమ్
హైదరాబాద్,జూలై16(జనం సాక్షి ): ప్రభుత్వ ఆస్పత్రులను బలోపతేం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందు కేసింది. ఇప్పటికే అన్ని పరీక్షలను ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన మాస్టర్ హెల్త్ చెకప్ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది.
కార్పొరేట్ దవాఖానల కంటే తక్కువ ధరలకే నిమ్స్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌లో 2019లోనే ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్‌తో పాటు ఆయా వ్యాధులు, ప్రధాన అవయవాలకు సంబంధించిన వైద్య పరీక్షలను సంబంధిత వైద్యుల కన్సల్టేషన్ సిఫారసు మేరకు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ వెల్‌నెస్ సెంటర్ ఇన్‌చార్జి అనుగంటి సత్యాగౌడ్ వివరించారు. దీంతో హెల్త్‌చెకప్ చేయించుకొనేవారికి అన్ని సేవలు ఒకేచోట లభించడంతో పాటు సమయం ఆదా అవుతున్నది. మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా 12 రకాల వైద్య పరీక్షలతో పాటు రూ.15 వేలతో పురుషులకు, రూ.16 వేలతో మహిళలకు హోల్‌బాడీ చెకప్ కూడా నిర్వహిస్తున్నారు. హెల్త్ చెకప్‌కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వస్తున్నట్టు సత్యాగౌడ్ తెలిపారు. సాధారణంగా 40 ఏండ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకొంటే, రాబోయే వ్యాధులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చునని, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తుంటారు. ఈ వైద్య పరీక్షలను మాస్టర్ హెల్త్ చెకప్ అంటారు. కరోనా నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. నిమ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. హెల్త్‌చెకప్‌లన్నీ రెండు, మూడు గంటల్లోనే పూర్తవుతాయి. సింగిల్ విండో ద్వారా అన్నీ పరీక్షలు ఒకేచోట నిర్వహిస్తున్నాం. ముందుగా అపాయింట్‌మెంట్స్ తీసుకోవాల్సిన అవసరంగానీ, నిరీక్షించాల్సిన అవసరంగానీ ఉండదు. మాస్టర్ హెల్త్ చెకప్, ఇతర హెల్త్ చెకప్‌లు చేయించుకొన్నవారికి ఆయా వైద్యులతో కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. వైద్య పరీక్షల తరువాత రోగులు ఇన్స్యూరెన్స్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా నిమ్స్‌లోని అన్ని విభాగాల్లో చికిత్స పొందవచ్చు. దీంతో ఆస్పత్రులకు కూడా కొంత ఆదాయం సమకూరగలదని భావిస్తున్నారు.