ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలి: జెసి హరిజవహర్ లాల్
నల్లగొండ, నవంబర్21: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నజాయింట్ కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. బుధవారంనాడు త నఛాంబర్ లో ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడి/-మనిస్టేష్రన్‌కు చెందిన సీనియర్ అధికారుల బృందం జాయింట్ కలెక్టర్ తో సమావేశమై జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో విూ సేవ కార్యక్రమాలు పెద్దయెత్తున విజయవంతం అయ్యాయని సభ్యులకు వివరించారు. జిల్లాలో వాల్టా చట్టం కఠినంగా అమలు పరుస్తున్నట్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లాలో వేసే బోర్లకు సంబంధించి సమగ్ర వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫ్లోరోసిస్ 37 గ్రామాలలో తీవ్రంగా ఉందని శాససభ స్పీకర్ పర్యటన అనంతరం ఫ్లోరోసిస్ నివారణకు పటిష్టమై యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. డయల్ యువర్ ర్ జె.సి. కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్ననట్లు ఆయన వివరించారు. జిల్లా భౌగోళికంగా భిన్న వాతావరణ పరిస్థితులు కలవని, ఒక వైపు సారవంతమై భూమితోపాటు మరో వైపు పొడి వాతావరణం కలదని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య పరిస్థితి, ఈ-గవర్నర్సు, ప్రజావాణి, రైతు ఆత్మహత్యలపై బృందం సభ్యులు అడిగి ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రస్తుతం లబ్దిదారులను రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డులో ఎటువంటి పొరపాట్లు తప్పులు లేకుండా చూడాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. కమిటీ సభ్యులు జాయింట్ కలెక్ట ర్ కు మెమోంటోలను బ హుకరించారు .