ప్రభుత్వ పథకాలపై ప్రచారం
నెల్లూరు,ఫిబ్రవరి14(జనంసాక్షి): ప్రభుత్వ పథకాలపై ఈనెల 20 వరకు కళాజాతాల ద్వారా ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల ఏడీ ముర్తుజా తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కళాజాతా బృందాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాయన్నారు. కొరిశపాడు, కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురంలో కళాజాత బృందాలు ప్రచారాలను రైతు రుణమాఫీ, పింఛన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఆకర్షణీయ గ్రామాలు వార్డులు, ఇతర కార్యక్రమాలపై ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇదిలావుంటే సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో మంద కృష్ణమాదిగ సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు న్నారు. దీంతో ఆయన సీమాంధ్రలో ప్రజాదరణ కోల్పోయారన్నారు. ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఇష్టం లేదని, ఎస్సీ వర్గీకరణ అయితే అతని నాయకత్వం కోల్పోవాల్సి వస్తుందనే, ఇటువుంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారన్నారు. మాదిగల పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడిని మాదిగ ప్రజలను దూరం చేయడానికి వరంగల్‌లో ఆయన సభను భగ్నం చేయడానికి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. వరంగల్‌లో ముఖ్యమంత్రి సభను కొంత మంది రౌడీమూకలు ఆటంకం కల్పించడం బాధాకరమన్నారు.